గుస్సాడి నృత్యం చేసిన గవర్నర్‌ తమిళిసై

మారుమూల ఉన్న ఎంతో మంది కళాకారులను గుర్తించి గౌరవించడంపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Published : 02 Feb 2021 01:44 IST

హైదరాబాద్‌: మారుమూల ఉన్న ఎంతో మంది కళాకారులను గుర్తించి గౌరవించడంపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గుస్సాడి కళాకారుడు కనకరాజును గవర్నర్‌ మర్యాదపూర్వకంగా రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాఠోడ్‌తో కలిసి సంస్కృతి కళావేదికపై ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం కనకరాజు బృందం చేసిన గుస్సాడి నృత్యం వీక్షించి ఒక్కో కళాకారుడిని అభినందించారు. ఆ తర్వాత కనకరాజుతో కలిసి గవర్నర్‌ తమిళిసై, మంత్రి సత్యవతి రాఠోడ్‌ కాసేపు గుస్సాడి నృత్యంతో సందడి చేశారు. తమ గ్రామానికి రావాల్సిందిగా గవర్నర్‌ను కనకరాజు ఈ సందర్భంగా కోరారు.

ఇదీ చదవండి..

ధర్మారెడ్డి ఇంటిపై దాడి: 44మందికి రిమాండ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని