PIB: ఉచిత ల్యాప్‌టాప్‌లపై మోసపోకండి: పీఐబీ

సోషల్‌ మీడియా వచ్చాక ఏది నిజమైన వార్తో ఏది కాదో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యమవ్వడం లేదు.

Published : 27 Apr 2022 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా వచ్చాక ఏది నిజమైన వార్తో ఏది కాదో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యమవ్వడం లేదు. ఒకప్పుడు ఏదైనా విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలనుకుంటే వార్తా పత్రికల్లోనో, టీవీలోనో చూసి తెలుసుకునే వారు. కానీ ప్రస్తుతం కొన్ని వేల వెబ్‌సైట్‌లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ప్రభుత్వం సైతం పథకాల ప్రచారానికి వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తోంది. సంక్షేమ పథకాల గురించి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రజలకు తెలియజేస్తున్నారు అధికారులు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలంటూ ఫేక్‌ మెసేజ్‌లు ఫార్వడ్‌ చేస్తున్నారు. దీంతో అమాయకులు చాలా మంది మోసపోతున్నారు. తాజాగా అలాంటి ఒక న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. దీంతో అలాంటిదేమీ లేదంటూ ఏకంగా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ట్విట్‌ చేయాల్సి వచ్చింది.

‘దేశంలోని విద్యార్థులందరికీ ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తోంది. వాటిని పొందాలంటే కింద ఉన్న లింక్‌ తెరచి అందులో మీ వివరాలు నమోదు చేసుకోండి.’ ఈ మెసేజ్‌ కొన్ని రోజులుగా అందరికీ వస్తోంది. దీనిపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో అలాంటిదేమీ లేదంటూ అధికారిక ప్రకటన చేసింది. ఆ మెసేజ్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేస్తూ ‘వైరల్‌ అవుతోన్న ఈ మెసేజ్‌ పూర్తిగా ఫేక్‌. ప్రభుత్వం అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు’ అని ట్విట్‌ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని