Governor Tamilisai: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌.. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వండి: గవర్నర్‌ ఆదేశం

జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటన అంశంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. దీనిపై అనేక మీడియా రిపోర్టులను పరిశీలించానని..

Published : 05 Jun 2022 13:17 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటన అంశంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. దీనిపై అనేక మీడియా రిపోర్టులను పరిశీలించానని.. ఈ దుర్ఘటన అత్యంత బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిని గవర్నర్‌ తమిళిసై ఆదేశించారు.

జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌ వెళ్లిన మైనర్‌ బాలికను పరిచయం చేసుకున్న కొంతమంది యువకులు ఆమెను కారులో బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను తీసుకొచ్చి పబ్‌ వద్ద విడిచిపెట్టి వెళ్లారు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ స్పందించి నివేదిక అందజేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని