Tamilisai: రిపబ్లిక్‌ డేపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: తమిళిసై

రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు.

Published : 25 Jan 2023 13:19 IST

హైదరాబాద్: రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై తెలిపారు. రాజ్‌భవన్‌లోనే గవర్నర్‌ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లి.. అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని