ఎరువుల ధరలపై ప్రధాని కీలక నిర్ణయం

ఇటీవల పెంచిన ఎరువుల ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎరువుల ధరపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ

Updated : 20 May 2021 01:41 IST

దిల్లీ: ఇటీవల పెంచిన ఎరువుల ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎరువుల ధరపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో రైతులకు పాత ధరలకే ఎరువులు అందించాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో డీఏపీని పాత ధర రూ.1,200కే విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఫాస్పరిక్‌ ఆమ్లం, అమ్మోనియా ధరలు ఇటీవల అంతర్జాతీయస్థాయిలో 60శాతం నుంచి 70 శాతం పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం డీఏపీ ధరను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే రైతులపై పెరిగిన ఎరువుల ధరలు తీవ్ర భారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. డీఏపీపై ప్రస్తుతం ఇస్తున్న రాయితీ రూ.500ను రూ.1,200కు పెంచతూ నిర్ణయం తీసుకున్నారు. రాయితీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించనున్నట్లు తెలిపింది.  

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని