Paracetamol: గ్రాన్యూల్స్‌ నుంచి TSకు 16 కోట్ల మాత్రలు

మంత్రి కేటీఆర్‌ను కలిసిన గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రతినిధులు

Published : 13 May 2021 01:34 IST

హైదారాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న వేళ గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌ సాయం చేయడానికి ముందుకొచ్చింది. 16 కోట్ల పారాసెటమాల్‌ మాత్రలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రతినిధులు బుధవారం కలిశారు. రూ. ఎనిమిది కోట్ల విలువైన  పారాసెటమాల్‌ మాత్రలు విరాళంగా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. నేటి నుంచి వారానికి కోటి మాత్రలు చొప్పున మొత్తంగా 16 కోట్ల మాత్రలు ఉచితంగా ఇవ్వనున్నట్లు గ్రాన్యూల్స్‌ ప్రతినిధులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని