Heavy Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. పోలీసులు సూచిస్తున్న జాగ్రత్తలివే..!

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులకు రాచకొండ పోలీసులు పలు జాగ్రత్తలు సూచించారు.

Updated : 24 Jul 2023 19:36 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ జంట నగరాల్లో భారీ వర్షం (Hyderabad Heavy Rains) కురుస్తోంది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు నేపథ్యంలో సురక్షితంగా ఉండేలా రాచకొండ పోలీసులు (Rachakonda Police) ప్రజలకు కొన్ని జాగ్రత్తలను సూచించారు. 

హైదరాబాద్‌లో భారీ వర్షం

  • అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి.
  • నీటి ప్రవాహంతో ఉన్న కాల్వలు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయొద్దు.
  • విద్యుత్‌ స్తంభాలు, పడిపోయిన విద్యుత్‌ లైన్లకు దూరంగా ఉండండి.
  • చెట్ల కింద, పాత గోడల పక్కన ఉండొద్దు.
  • కొత్త దారిలో పోకుండా ఎప్పుడూ వెళ్లే దారిని మాత్రమే ఉపయోగించండి (ఎక్కడ ఏం ఉంటుందో తెలిసి ఉంటుంది గనక)
  • పిల్లలను ఆడుకొనేందుకు వర్షపు నీటిలోకి గానీ, వరద నీటి సమీపంలోకి గానీ పంపొద్దు.
  • ఎట్టి పరిస్థితుల్లో మ్యాన్‌ హోల్స్‌ దరిదాపుల్లోకి పిల్లలను వెళ్లనివ్వొద్దు.
  • చెరువులు, మురికి కాల్వలు, కుంటలు, ప్రవహించే నీటి వద్దకు వారిని వెళ్లనీయకుండా చూసుకోండి.
  • ఇంట్లో విద్యుత్ పరికరాల వద్దకు, బయట విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాల వైపు చిన్నారులు వెళ్లకుండా తగిన జాగ్రత్త తీసుకోండి.
  • అత్యవసర సమయాల్లో 100కి డయల్‌ చేయండి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని