KCR: కేసీఆర్‌కు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ పూర్తి

మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ (KCR)కు యశోద ఆసుపత్రి వైద్యులు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ (తుంటి ఎముక మార్పిడి) శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 

Updated : 08 Dec 2023 22:48 IST

హైదరాబాద్‌: మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ (KCR)కు యశోద ఆసుపత్రి వైద్యులు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ (తుంటి ఎముక మార్పిడి) శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. గురువారం రాత్రి ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో కాలుజారి పడిపోయిన కేసీఆర్‌ని కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. డాక్టర్‌ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం పరీక్షల అనంతరం హిప్‌ రిప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. దీంతో శుక్రవారం సాయంత్రం వైద్యుల బృందం సుమారు నాలుగున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించింది.

సర్జరీ విజయవంతంగా పూర్తయిందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స తరువాత ఐవీ ఫ్లూయిడ్స్‌, యాంటీ బయోటిక్స్‌, నొప్పి నివారణ మందులతో చికిత్స అందిస్తున్నట్టు హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించారు. ఎనిమిది వారాల్లో కేసీఆర్‌ పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స తర్వాత కేటీఆర్‌, హరీశ్‌రావు ఇతర కుటుంబ సభ్యులు కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని