Health: చెమట వాసన చికాకు పెడుతోందా..?

రోజుకు రెండు పూటలా స్నానం చేస్తున్నా చెమట వాసన పదిమందిలో ఇబ్బంది పెడుతుంది. పౌడర్‌, డియోడరెంట్లు వాడుతున్నా కంపు కష్టాలను తెస్తుంది. 

Published : 28 May 2022 02:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజుకు రెండు పూటలా స్నానం చేస్తున్నా చెమట వాసన పది మందిలో ఇబ్బంది పెడుతుంది. పౌడర్‌, డియాడరెంట్లు వాడుతున్నా ఈ సమస్య కష్టాలను తెస్తుంది. వేసవిలో ఉండే ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలా? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. కొందరు వైద్యుల వద్దకు వెళ్లినా ఈ సమస్య అంత త్వరగా వదిలిపోదు. అయితే, దీన్ని ఎలా అధిగమించాలో వైద్యులు పలు సూచనలు చేశారు. 

  • ఏ పనైనా చేసినపుడు ప్రతి ఒక్కరికి చెమట పడుతుంది. కొందరికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా ఉంటుంది. అసలే చెమట రాని వారుండరు. ఇది ఆరోగ్యకరమే. కానీ కొంతమందికి చెమటతో పాటే దుర్వాసన వస్తుంది.
  • చెమట వాసన వదిలించుకోవడానికి నీటిలో డెటాల్‌, రోజ్‌వాటర్‌.. ఏదైనా ఒకటి కొన్ని చుక్కలు కలుపుకొని స్నానం చేయాలి.
  • బాడీస్ప్రే, ఫెర్‌ఫ్యూమ్‌ వాడుకోవచ్చు. ఎక్కువగా చెమట పట్టే చోట బేబీపౌడర్‌ చల్లుకోవాలి.
  • ఎండలు తగ్గేదాకా కాటన్‌ దుస్తులు మాత్రమే వేసుకోవాలి. సింథటిక్‌ దుస్తులు మరింత చెమట వచ్చేలా చేస్తాయి.
  • ప్రతి రోజు దుస్తులు మార్చుకోవాలి. లేకపోతే దుర్వాసనను మరింత పెంచుతాయి.
  • చెమటతో శరీరం నుంచి జింకు లవణం అధికంగా పోతుంది. దీన్ని తిరిగి భర్తీ చేసుకోవడానికి బీన్స్‌, క్యారెట్‌, బఠాణీ లాంటి వాటిని ఆహారంలో ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
  • సొంపు తింటే నోటినే కాదు.. శరీరంలో దుర్వాసనను దూరం చేస్తుంది. రోజూ ఒక చెంచా సొంపు తింటే మంచి ఫలితం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని