Ts News: మార్చి 21 నుంచి యాదాద్రిలో మహాసుదర్శనయాగం

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు దాదాపు 95శాతం పూర్తయ్యాయని దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మహా సుదర్శనయాగం తర్వాత మార్చి 28 నుంచి యాదాద్రీశుడి స్వయంభూ దర్శనాలకు...

Published : 21 Jan 2022 23:05 IST

యాదాద్రి: యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు దాదాపు 95శాతం పూర్తయ్యాయని దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మహా సుదర్శనయాగం తర్వాత మార్చి 28 నుంచి యాదాద్రీశుడి స్వయంభూ దర్శనాలకు అనుమతిస్తామని తెలిపారు. ధ్వజస్తంభం బంగారు తాపడం, క్యూ కాంప్లెక్స్‌, కల్యాణ కట్ట పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు. మార్చి 21 నుంచి 28 వరకు రోజుకు లక్ష మంది భక్తులకు అన్న ప్రసాదం అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. 75 ఎకరాల్లో 6వేల మంది రుత్వికులతో పూజలు చేయనున్నట్టు పేర్కొన్నారు.  స్వామి దర్శనానంతరం ప్రధానాలయం అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం కొండపైన హరిత కాటేజీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని