TS INTER: తెలంగాణలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి

Updated : 29 Jun 2022 22:10 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ మేరకు సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ప్రాక్టికల్స్‌లో ఉత్తీర్ణులు కాని వారికి జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు జులై 22న మానవ విలువలు, జులై 23న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు నెలాఖరుకు  ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని