Konaseema: కోనసీమలో ఇంటర్నెట్‌ బంద్‌.. గోదావరి తీరానికి క్యూకట్టిన యువత..!

కోనసీమలో ఐదు రోజులైనా ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించలేదు. ఇటీవల అమలాపురలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో..

Published : 30 May 2022 02:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమలాపురంలో జరిగిన ఘటన నేపథ్యంలో కోనసీమలో ఐదు రోజులైనా ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించలేదు. మరోసారి అటువంటి ఘటనలకు చోటివ్వకుండా కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ఐదు రోజులైనా వాటి పునరుద్ధరణకు నిర్ణయం తీసుకోలేదు.

దీంతో ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలో ఇంటర్నెట్‌ సేవలు ఆగిపోయాయి. ఫలితంగా ఆరోగ్యశ్రీ, ఉపాధిహామీ పనుల వివరాల నమోదు, డిజిటల్‌ లావాదేవీలకు విఘాతం ఏర్పడింది. ముఖ్యంగా ఇంటి వద్ద పనులు చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సోషల్‌మీడియా సహా వాట్సాప్‌, మెయిల్స్‌ చెక్‌ చేసుకోవడానికి ఫోన్‌ డేటా సిగ్నల్‌ కోసం యువత గోదావరి తీరాలకు చేరుతోంది. పశ్చిమగోదావరి జిల్లా వైపు లంకలు దాటుతున్నారు. మొబైల్‌ డేటా సిగ్నల్‌ అందిన చోట ప్రజలు గుమిగూడుతున్నారు.

మరోవైపు అమలాపురంలో విధ్వంసంపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 44 మందిని అరెస్ట్‌ చేశారు. మరింత మందిని అరెస్ట్‌ చేసే పనిలో వారు నిమగ్నమయ్యారు. వాట్సాప్‌తో సమాచారం చేరవేత ద్వారానే అమలాపురంలో విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని