IPS Anand Mishra: ‘అస్సాం సింగం’ ఆనంద్‌ మిశ్రా రాజీనామా

అస్సాంకు చెందిన సీనియర్‌ పోలీస్‌ అధికారి, మణిపుర్‌ అల్లర్లపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్‌లో భాగమైన ఐపీఎస్‌ ఆనంద్‌ మిశ్రా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

Published : 28 Dec 2023 01:47 IST

గువాహటి: అస్సాం(Assam) కు చెందిన సీనియర్‌ పోలీస్‌ అధికారి, మణిపుర్‌ అల్లర్లపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్‌లో భాగమైన ఐపీఎస్‌ ఆనంద్‌ మిశ్రా (IPS Anand Mishra).. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. జీవితాన్ని స్వేచ్ఛగా కొనసాగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన ఆనంద్‌ మిశ్రా.. సోషల్‌మీడియాలో చాలా పాపులర్‌. అస్సాంలో మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా, దోపిడీలను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో అక్కడి ప్రజలు ఆయన్ను ‘అస్సాం సింగం’గా పిలవడం మొదలుపెట్టారు. రాష్ట్రంలోని లఖింపూర్‌ జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆయన్ను మణిపుర్‌ అల్లర్లపై దర్యాప్తు కోసం బదిలీ చేశారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఐపీఎస్‌కు మించి సామాజిక సేవలు చేయడం ద్వారా స్వేచ్ఛాయుత జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నా. అందుకే, బేషరతుగా ఐపీఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’ అని ఆనంద్‌ మిశ్రా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  కాగా.. మిశ్రా త్వరలో భాజపాలో చేరుతారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన సొంత రాష్ట్రం బిహార్‌ నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని