ఈజిప్టు మమ్మీకి సీటీ స్కాన్‌!

ఇటలీ పరిశోధకులు ఓ ఈజిప్టు మమ్మీకి సీటీ స్కాన్ చేశారు. ఆ మమ్మీ ఎవరు, ఏమిటి?అన్న పూర్వాపరాలను తెలుసుకోవడం సహా

Published : 24 Jun 2021 00:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరిశోధన ఓ నిరంతర ప్రయాణం. మనిషి జీవితాన్ని సులభతరం చేసిన ఆధునిక సాంకేతికత.. ఆ పరిశోధన ఫలితమే. ఇందులో భాగంగానే ఇటలీ పరిశోధకులు ఓ ఈజిప్టు మమ్మీకి సీటీ స్కాన్ చేశారు. ఆ మమ్మీ ఎవరు, ఏమిటి? అన్న పూర్వాపరాలను తెలుసుకోవడం సహా వేల ఏళ్ల క్రితం ఉన్న వ్యాధుల గురించి ఈ సీటీ స్కాన్ ఫలితాలతో పరిశోధనలు జరుపుతున్నారు. 

వేల ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తుల మృత దేహాలను రసాయనాల సాయంతో మమ్మీలుగా మార్చి భద్రపరచగా, వాటిని కాపాడుకుంటూ వస్తోంది ఈజిప్టు. ఈ మమ్మీలపై ఇప్పటికే అనేక పరిశోధనలు జరగ్గా, ప్రస్తుతం పరిశోధకులు మరొక అడుగు ముందుకు వేసి మమ్మీ పూర్వాపరాలను తెలుసుకునేందుకు సీటీ స్కాన్‌ నిర్వహించారు.

ఈజిప్టులోని బెర్గామో మ్యూజియంలోని మమ్మీని ఇటలీలోని మిలాన్‌ పాలీక్లినికో ఆసుపత్రిలో ఈ సీటీ స్కాన్‌ చేపట్టారు. దీని ఫలితాల విశ్లేషణల ద్వారా కొంత సమాచారం సేకరించిన పరిశోధకులు.. మరిన్ని రహస్యాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ మమ్మీ ఓ పురుష మత ప్రబోధకుడిదని పరిశోధకులు భావించగా, సీటీ స్కాన్‌లో మాత్రం అది 20 ఏళ్ల వయసున్న ఒక గర్భిణిది అని తేలింది. ఇది క్రీ.పూ 800 నుంచి 900 సంవత్సరం నాటిదిగా ఈ పరిశోధనల ద్వారా అంచనా వేశారు. 

మృతదేహాన్ని మమ్మీగా మార్చిన రసాయన ప్రక్రియ, దానికోసం వాడిన పదార్థాలు, ఆనాటి అంత్యక్రియ పద్ధతులపై పరిశోధకులు సీటీ స్కాన్‌ ఫలితాలతో ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తి జీవనగమనం, మరణానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పూర్వకాలంలో ఉన్న వ్యాధులపై పరిశోధన చేస్తున్నారు. ఆధునిక వైద్య పరిశోధనల్లో ఈ సమాచారం కీలకం కాబోతోందని నిపుణులు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని