JEE Main: జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలు మళ్లీ మార్పు.. ‘నీట్’ దరఖాస్తుల ఆహ్వానం

జేఈఈ మెయిన్‌ పరీక్షల తేదీలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) మరోసారి రీషెడ్యూల్‌ చేసింది.

Updated : 07 Apr 2022 00:18 IST

దిల్లీ: జేఈఈ మెయిన్‌ పరీక్షల తేదీలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) మరోసారి రీషెడ్యూల్‌ చేసింది. ఏప్రిల్‌ 21 నుంచి మే 4 వరకు జరగాల్సిన సెషన్‌ 1 పరీక్షలను జూన్‌ 20 నుంచి 29 వరకు నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. అలాగే మే 24 నుంచి 29 వరకు జరగాల్సి ఉన్న జేఈఈ మెయిన్‌ సెషన్‌ -2 పరీక్షలను జులై 21 నుంచి 30వరకు నిర్వహించనుంది.  

ఇక వైద్యవిద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌(యూజీ)-2022కు సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దరఖాస్తులను ఆహ్వానించింది.  ఈసారి మొత్తం 543 ప్రాంతాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాత్రి 11.50 గంటల నుంచి మే 6న రాత్రి 11.50 గంటలవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్ష నిర్వహించే నగరాలు, అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కి సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. జులై 17న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5.20 గంటలవరకు పరీక్ష జరగనుంది. తెలుగుతో సహా మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇక జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు ఫీజు రూ.1,600, జనరల్‌ ఈడబ్యూఎస్‌, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ విద్యార్థులకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌ జెండర్‌ విద్యార్థులకు రూ.900 ఫీజుగా నిర్ణయించారు. ఇక విదేశీ విద్యార్థులు రూ.8,500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. తొలిసారిగా దేశం వెలుపల 14 నగరాల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది.. ఆ నగరాలివే..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని