KTR: టీ హబ్ కొత్త బ్లాక్‌లో త్రీడీ ప్రింటింగ్ కోసం ప్రత్యేక ల్యాబ్: కేటీఆర్‌

వైద్యరంగంలో మెరుగైన ఫలితాలు సాధించడంలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్

Updated : 13 May 2022 15:25 IST

హైదరాబాద్‌: వైద్యరంగంలో మెరుగైన ఫలితాలు సాధించడంలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో వైద్య పరికరాలు, ఇంప్లాంట్‌ల త్రీడీ ప్రింటింగ్‌పై నేషనల్ సెంటర్ ఫర్ అడెటివ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, నేషనల్ సెంటర్ ఫర్ అడెటివ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ డైరెక్టర్ రమాదేవి లంకా, పలువురు వైద్యులు సదస్సులో పాల్గొన్నారు. ఆర్థోపెడిక్, డెంటల్ సహా వివిధ రకాల వైద్య విభాగాల్లో త్రీడీ ప్రింటింగ్ ద్వారా చేసిన పరికరాలు, ఇంప్లాంట్లు ఏ మేరకు ఉపయోగపడతాయన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. త్రీడీ ప్రింటింగ్ వృద్ధికి సంబంధించి పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఇందులో భాగంగా త్వరలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నేషనల్ సెంటర్ ఫర్ అడెటివ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఉస్మానియా వర్సిటీ మధ్య ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. భారత్‌లో వైద్య పరికరాల త్రీడీ ప్రింటింగ్ రంగాల్లో భారీగా అవకాశాలు ఉన్నాయన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న టీ హబ్ కొత్త బ్లాక్‌లో త్రీడీ ప్రింటింగ్ కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయనన్నట్టు కేటీఆర్‌ ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని