Laparoscopy: లాప్రోస్కోపీతో ఆపరేషన్‌ చాలా సులువు..! ఎలాగో తెలుసుకోండి

ఒకప్పుడు ఆపరేషన్‌ అనగానే పెద్ద పెద్ద గాట్లు..విపరీతమైన నొప్పి..రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండటంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగానే ఉండేది..ఇపుడు లాప్రోస్కోపీతో ఆ ఇబ్బందులేవీ కనిపించవు. ఒకటి, రెండు రోజుల్లో ఎలాంటి జబ్బులకయినా ఆపరేషన్‌ చేసి ఇంటికి పంపిస్తున్నారు. పెద్దగా కోతలుండవు..రోగికి నొప్పి తెలియదు.

Published : 25 Sep 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు ఆపరేషన్‌ అనగానే పెద్ద పెద్ద గాట్లు..విపరీతమైన నొప్పి..రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండటంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగానే ఉండేది..ఇపుడు లాప్రోస్కోపీతో ఆ ఇబ్బందులేవీ కనిపించవు. ఒకటి, రెండు రోజుల్లో ఎలాంటి జబ్బులకయినా ఆపరేషన్‌ చేసి ఇంటికి పంపిస్తున్నారు. పెద్దగా కోతలుండవు..రోగికి నొప్పి తెలియదు. మందుల వినియోగం కూడా తక్కువగానే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల గైనిక్‌ సమస్యల్లో ఈ విధానం చాలా అనుకూలంగా ఉంటుందని లాప్రోస్కోపిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎం. విజయ తెలిపారు.

ఇబ్బందులు తగ్గిపోయాయి..

లాప్రోస్కోపీతో మహిళలకు ఆపరేషన్‌ చేయడం సులువుగా ఉంటోంది. పైబ్రాయిడ్స తొలగింపు లాంటి ఆపరేషన్లను చేసిన కొద్ది గంటల్లోనే ఇంటికి పంపించగలుగుతున్నాం.  కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌, రీకనలైజేషన్‌, ఇన్‌ఫెర్టిలిటీకి లాప్రోస్కోపీతో ఫలితాలు బాగుంటాయి. ఒక సెంటీమీటరు కోత పెట్టి ఆపరేషన్‌ చేస్తున్నాం. నొప్పి తక్కువగా ఉంటుంది. రక్తస్రావం కూడా ఎక్కువగా ఉండదు. ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ల పనులు వాళ్లే చేసుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని