TS Corona: కొత్తగా 4,693 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో  71,221 నమూనాలను పరీక్షించగా.. 4,693 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది

Updated : 13 May 2021 18:04 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో  71,221 నమూనాలను పరీక్షించగా.. 4,693 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది. తాజాగా 33 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 2,863కి పెరిగింది. ఇవాళ 6,876 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో 56,917 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 734 కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని