Weather Report: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నేడు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్

Published : 26 Jun 2022 14:04 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నేడు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది. తూర్పు పశ్చిమ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశా మీదుగా.. సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వివరించింది. అంతర్గత ఒడిశా, దాని పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఒడిశా, దాని పరిసరాలలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని