Liquor prices: తెలంగాణలో తగ్గిన మద్యం ధరలు.. ఇవాళ్టి నుంచే అమలు

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.  రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినట్లు సర్కారు వెల్లడించింది.

Updated : 05 May 2023 21:41 IST

హైదరాబాద్: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినట్లు సర్కారు వెల్లడించింది. మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్‌కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి. ఫుల్‌ బాటిల్‌పై రూ.40, హాఫ్‌ బాటిల్‌పై రూ.20, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలు తగ్గాయి. కొన్ని రకాల బ్రాండ్స్ ఫుల్ బాటిల్స్‌పై రూ.60 వరకు తగ్గించినట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వచ్చాయని తెలిపారు. అధిక ధరల కారణంగా బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్లు అధికారులు తేల్చారు. అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకే ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు ఆబ్కారీ అధికారులు వివరించారు. ఇవాళ్టి నుంచి తయారయ్యే మద్యం బాటిళ్లపై తగ్గిన ధరలు ప్రింట్ అవుతాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు లిక్కర్ తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని