Maskతో శ్రీరామరక్ష

భయాల నుంచి రక్షణ ఇస్తాడు అభయాంజనేయుడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇప్పుడు అవగాహన కూడా కల్పిస్తున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌లో మాస్కు ధరించిన హనుమంతుడు దర్శనమిస్తున్నాడు....

Published : 23 Apr 2021 14:40 IST

కోరుట్ల: భయాల నుంచి రక్షణ ఇస్తాడు అభయాంజనేయుడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇప్పుడు అవగాహన కూడా కల్పిస్తున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌లో మాస్కు ధరించిన హనుమంతుడు దర్శనమిస్తున్నాడు. కరోనా నుంచి కాపాడుకోవడానికి మాస్కే శ్రీరామ రక్ష అంటూ ప్రజలకు బోధిస్తున్నాడు. 

అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఐలాపూర్‌ వాసులు గతంలో ఏర్పాట్లు చేశారు. కరోనా కేసులు పెరుగడంతో ప్రతిష్ఠాపన నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆంజనేయస్వామి విగ్రహానికి గ్రామస్థులు మాస్కు కట్టారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో మాస్కు ధరించడం పట్ల అవగాహన కలుగుతుందని వారు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని