Maharatra: బంగారు రంగు చేపతో రూ.కోటి సంపాదించాడు!

మహారాష్ట్రలోని పల్‌ఘర్‌ జిల్లాలో ఓ మత్స్యకారుడికి అదృష్టం వరించింది. తను కలలో కూడా సంపాదించలేనంత డబ్బు ఒక్క రాత్రిలోనే తన ఇంటికి వచ్చి చేరింది

Published : 02 Sep 2021 01:18 IST

ముంబయి: చేపల్లో చాలా రకాలుంటాయి. కొన్ని చూడటానికి భిన్నమైన ఆకృతిలో ఆకట్టుకునేలా ఉంటాయి. మరికొన్ని సాధారణంగానే ఉన్నా ధర మాత్రం ఊహించలేనంతగా ఉంటుంది. తాజాగా మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ఓ మత్స్యకారుడికి అదృష్టం వరించింది. తను కలలో కూడా సంపాదించలేనంత డబ్బు ఒక్క రాత్రిలోనే తన ఇంటికి వచ్చి చేరింది. చంద్రకాంత్‌ తరే అనే మత్స్యకారుడు గత కొన్నేళ్లుగా చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో ఆగస్టు 28న కూడా చేపల వేటకు వెళ్లాడు. తను విసిరిన వలలో ఒక్కసారే 150 వరకు చేపలు పడ్డాయి. అవన్నీ మామూలు చేపలు కాదు ‘గోల్‌ ఫిష్‌’ జాతికి చెందినవి. చంద్రకాంత్‌ సముద్రం నుంచి తిరిగొచ్చాక వీటిని అమ్మడానికి మార్కెట్లో బేరం వేయడంతో దాదాపు రూ.1.33 కోట్ల ధర పలికాయి. ఈ చేపలో అనేక ఔషధ గుణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో వీటితో మందులు తయారు చేస్తారు. అలా తయారైన మందులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. వీటిని ‘బంగారు రంగు చేప’ అని కూడా పిలుస్తారు. ఇవి ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లోని సముద్రజలాల్లో ఎక్కువగా కనబడుతుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని