అద్భుతం: ఒకే కాన్పులో 9 మంది జననం

పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో అద్భుతం చోటుచేసుకుంది. మంగళవారం ఓ మహిళ ఒకే కాన్పులో 9 మంది శిశువులకు జన్మనిచ్చింది. కాగా వారందరూ ఆరోగ్యంగా ఉన్నారు. హాలిమా సిస్సే (25) అనే మహిళ గర్భం దాల్చగా మార్చిలో ఆమెను పరీక్షించిన వైద్యులు....

Updated : 05 May 2021 14:14 IST

మాలి: పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో అద్భుతం చోటుచేసుకుంది. మంగళవారం ఓ మహిళ ఒకే కాన్పులో 9 మంది శిశువులకు జన్మనిచ్చింది. కాగా వారందరూ ఆరోగ్యంగా ఉన్నారు. హాలిమా సిస్సే (25) అనే మహిళ గర్భం దాల్చగా మార్చిలో ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భంలో ఏడుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షించారు. మంగళవారం హాలిమా సిస్సేకి నొప్పులు రావడంతో శస్త్రచికిత్స నిర్వహించారు. కాగా అనుకున్నదానికంటే ఇద్దరు శిశువులు అధికంగా జన్మించడంతో వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తం 9 మంది జన్మించగా అందులో ఐదుగురు ఆడ శిశువులు, నలుగురు మగవారు. కాగా తల్లీబిడ్డలందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు మాలీ ఆరోగ్య శాఖ మంత్రి ఫాంటా సిబే ఓ ప్రకటనలో తెలిపారు. ఒకే కాన్పులో ఇంతమందికి జన్మనివ్వడమే కాకుండా వారందరూ క్షేమంగా ఉండటం ఓ అద్భుతమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts