Viral Video: భార్యకు ముద్దుపెట్టాడని భర్తను కొట్టారు..

నదిలో స్నానం చేస్తుండగా భార్యకు ముద్దుపెట్టాడని ఓ భర్తను అక్కడున్న వారు అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు కొట్టారు.

Published : 23 Jun 2022 03:56 IST

అయోధ్య: నదిలో స్నానం చేస్తుండగా భార్యకు ముద్దుపెట్టాడని ఓ భర్తను అక్కడున్న వారు అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు కొట్టారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

అయోధ్యలో ప్రవహించే పవిత్ర సరయూనదిలో ఓ జంట స్నానం చేయడానికి అందులో దిగింది. ఈ క్రమంలో భర్త తన భార్యకు ముద్దుపెట్టాడు. దీంతో నదిలో పక్కనే స్నానం చేస్తున్న పలువురు అతడిని నది నుంచి పక్కకు లాగి తిట్టడంతో పాటు చేయిచేసుకున్నారు. అయోధ్యలో ఇలాంటి పనులు చేయడాన్ని సహించం అని ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని