విడాకులు తీసుకున్న ఆనందంలో బంగీ జంప్.. వికటించి ఆసుపత్రికి!
విడాకులు తీసుకున్న ఆనందంలో సాహసం చేశాడో వ్యక్తి. అది కాస్తా అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.
Representational image
ఇంటర్నెట్‌డెస్క్: విడాకులు తీసుకున్న ఆనందంలో ఇటీవల ఓ బుల్లితెర నటి ఫోటో షూట్ చేయించుకున్న విషయం గుర్తుంది కదా.. అచ్చం అలాంటిదే ఈ ఘటనే ఇది. తన భార్య నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఆనందంతో పెద్ద సాహసమే చేశాడు. అది కాస్తా వికటించడంతో ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. బంగీ జంప్ చేసి ఆస్పత్రి బెడ్‌పైకి చేరాడు.
బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ డోస్ శాంటోస్ తోస్టా (22) అనే వ్యక్తి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న సందర్భంగా తనకు నచ్చిన పనులన్నీ చేస్తూ ఆనందంగా గడపాలనుకున్నాడు. అందులో భాగంగానే బంగీ జంప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం బ్రెజిల్‌లోని కాంపో మాగ్రోలో బ్రిడ్జ్ స్వింగ్‌లో పాల్గొనడానికి వెళ్లాడు. ఆనందంగా 70 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేయాలని వెళ్లి తాడు సాయంతో కిందకు దూకాడు. అంతలోనే తాడు తెగిపోవడంతో రాఫెల్ కిందనున్న నీటి కొలనులోకి పడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందకు పడటంతో మెడ విరిగింది. శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి. మొత్తానికైతే ప్రాణాలతో మాత్రం బయటపడ్డాడు. వాస్తవంగా ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరగ్గా.. తాజాగా అతడు కోలుకోవడంతో వెలుగులోకి వచ్చింది.
‘విడాకులు తీసుకున్న అనంతరం నేను బంగీ జంప్ చేయాలనుకున్నా. కానీ ఇలా అవుతుందని అసలు ఊహించలేదు. ఆ రోజు కళ్లు తెరిచే సమయానికి నీటిలో ఉన్నాను. చుట్టూ ఉన్న వారు ‘కదలకు అలాగే ఉండు, నీకు సాయం చేయడానికి వస్తున్నారు’ అంటూ ఉంటే అసలేం జరిగిందో నాకు అర్థం కాలేదు. చాలా భయం వేసింది. చివరకు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాను. జీవితానికి ఎంతో విలువ ఉంది. దాన్ని లెక్క చేయకుండా ఎన్నో పిచ్చి పనులు చేశా’ అంటూ రాఫెల్ ఆ ఘటన గురించి చెబుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..
-
జాగ్రత్త.. ఎండార్స్ చేసినా కేసులు పెడుతున్నారు
-
పవన్ పర్యటన నేపథ్యంలో.. అర్ధరాత్రి హడావుడిగా రహదారి పనులు!
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు