Flight: ఏలియన్స్‌ను చూడాలని విమానం దొంగిలించబోయాడు!

బైకులు దొంగలించేవాళ్లను చూశాం.. కార్లు, ఇతర వాహనాలను దొంగలించేవాళ్లను చూశాం. కానీ, అమెరికాలో ఓ వ్యక్తి ఏకంగా విమానాన్నే ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. బాంబుతో పేల్చేస్తానని బెదిరించాడు. చివరకి విమనాశ్రయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకోగా.. ఏలియన్స్‌ చూడటానికే

Updated : 13 Dec 2021 04:46 IST

వాషింగ్టన్‌: బైకులు దొంగలించేవాళ్లను చూశాం.. కార్లు, ఇతర వాహనాలను దొంగలించేవాళ్లను చూశాం. కానీ, అమెరికాలో ఓ వ్యక్తి ఏకంగా విమానాన్నే ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. బాంబుతో పేల్చేస్తానని బెదిరించాడు. చివరకి విమానాశ్రయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకోగా.. ఏలియన్స్‌ చూడటానికే విమానం దొంగిలించే ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

యూఎస్‌లోని నెవడాలో ఉన్న ‘ఏరియా 51’ ప్రాంతంలో అమెరికాకు చెందిన ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ ఒకటి ఉంది. అయితే, అక్కడికి ఏలియన్స్‌ వస్తుంటాయని చాలా కాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న 36ఏళ్ల మాథ్యూ హన్‌కాక్‌.. ఏలియన్స్‌ చూడటం కోసం ఆ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి విమానసేవలు లేకపోవడంతో విమానాన్ని దొంగతనం చేయాలని భావించాడు. దీంతో డిసెంబర్‌ 8న మాథ్యూ ముఖానికి ఒక జోకర్‌ మాస్క్‌ ధరించి.. లాస్‌వెగాస్‌లోని మెక్‌ కరన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొరబడ్డాడు. భద్రతా కంచెలను చీల్చుకుంటూ కారులో రన్‌వేపైకి దూసుకొచ్చాడు. ఆగి ఉన్న విమానం వద్దకు వెళ్లగా.. అక్కడ విమాన సిబ్బంది ఎదురుపడ్డారు. దీంతో తన వద్ద బాంబు ఉందని.. దాంతో విమానాన్ని పేల్చేస్తానని బెదిరించాడు. అయినా అతడిని విమాన సిబ్బంది ప్రతిఘటించడంతో కారు ఎక్కి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకు విమానాశ్రయ సిబ్బంది అతడిని అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని