చట్టబద్ధ బాధ్యతలు నిర్వర్తించేలా రిజిస్ట్రార్లను ఆదేశించండి

‘మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Published : 23 Dec 2022 22:50 IST

హైకోర్టులో వ్యాజ్యం వేసిన మార్గదర్శి చిట్‌ఫండ్‌
పిటిషన్లపై వాదనలు పూర్తి.. నిర్ణయం వాయిదా

ఈనాడు, అమరావతి: చిట్‌ఫండ్స్‌ చట్ట నిబంధనల మేరకు చట్టబద్ధ విధులను నిర్వర్తించేలా రిజిస్ట్రార్లను(చిట్‌) ఆదేశించాలని, నిర్దిష్ట గడువులో తమ అభ్యర్థనలను పరిష్కరించకుండా... నిబంధనల మేరకు నడుచుకోలేదనే కారణం చూపి తమపై జరిమానా విధించకుండా నిలువరించాలని, తొందరపాటు చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ ‘మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. మార్గదర్శి సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి అనుబంధ పిటిషన్లపై తీర్పును వాయిదా(రిజర్వు) వేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని