Botsa: 28 మంది ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రాలేదు: మంత్రి బొత్స
ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ల్లో మొత్తం 695 మంది ఏపీ వాసులు ప్రయాణించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వివరాలు వెల్లడించారు.

విశాఖపట్నం: ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ల్లో మొత్తం 695 మంది ఏపీ వాసులు ప్రయాణించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వివరాలు వెల్లడించారు.
ఏపీ ప్రయాణికుల్లో 553 మంది సురక్షితంగా ఉన్నారని.. 92 మంది తాము ట్రావెల్ చేయలేదని తెలిపినట్లు చెప్పారు. మిగిలిన వారిలో 28 మంది ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రాలేదన్నారు. ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్లు గుర్తించి వారి ఇళ్లకు అధికారులను పంపి వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. మరో 22 మంది స్వల్పంగా గాయపడ్డారని.. వారికి చికిత్స కొనసాగుతున్నట్లు బొత్స వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అమర్‌నాథ్, ఆరుగురు అధికారులు ఒడిశా వెళ్లి అక్కడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీనిపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం జగన్‌కు చేరవేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రిజర్వేషన్ చార్ట్ ప్రకారం కోరమాండల్‌లో 484, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నట్లు బొత్స చెప్పారు. యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతిలో 107 మంది ఎక్కారని తెలిపారు. అన్‌రిజర్వుడ్ ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ సమాచారాన్ని ఒడిశాలోని వివిధ ఆస్పత్రుల నుంచి మంత్రి అమర్‌నాథ్, అధికారుల బృందం సేకరిస్తోందని చెప్పారు. ఇంకా 180 మృతదేహాల వివరాలను గుర్తించాల్సి ఉన్నట్లు అక్కడి నుంచి తమకు సమాచారం వచ్చిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Soldier: ‘ఫేమస్’ కావాలని.. కేరళలో ఓ సైనికుడి నిర్వాకం!
-
Nara Lokesh: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: రాష్ట్రపతిని కోరిన లోకేశ్
-
Suryakumar Yadav: ‘సూర్యను ప్రతి మ్యాచ్‌లో ఆడించాలి.. అతని కంటే బెటర్ ప్లేయర్ ఏ జట్టులోనూ లేడు’
-
TSRTC: గణేశ్ నిమజ్జనానికి 535 ప్రత్యేక బస్సులు.. వివరాలివే..!
-
Vivek Agnihotri: ‘ది వ్యాక్సిన్ వార్’ విషయంలో ఇది పెద్ద అగ్ని పరీక్ష: వివేక్ అగ్నిహోత్రి
-
IndiGo Chief: అత్యంత పోటీ ఉన్న ఏవియేషన్ మార్కెట్ లో భారత్ ఒకటి : ఇండిగో చీఫ్