GVMC: విశాఖలో పేదల ఇళ్లు కూల్చొద్దు: జీవీఎంసీకి మంత్రుల ఆదేశం

నిబంధనల పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దని జీవీఎంసీ అధికారులను మంత్రులు ఆదేశించారు. విశాఖ నగరాభివృద్ధిపై మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజయసాయిరెడ్డి...నిబంధనల పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దని జీవీఎంసీ అధికారులను మంత్రులు ఆదేశించారు. విశాఖ నగరాభివృద్ధిపై మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజయసాయిరెడ్డి

Published : 05 Sep 2021 01:10 IST

విశాఖ: నిబంధనల పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దని జీవీఎంసీ అధికారులను మంత్రులు ఆదేశించారు. విశాఖ నగరాభివృద్ధిపై మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. టౌన్‌ ప్లానింగ్‌, వీఎంఆర్‌డీఏ, కరోనా మూడో దశపై చర్చించారు. గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. వీఎంఆర్‌డీఏ బృహత్‌ ప్రణాళికపై 16వేల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ ప్రణాళిక తయారీలో క్షేత్రస్థాయి సమస్యలు పరిగణించలేదని చెప్పారు. అభ్యంతరాలు పరిష్కారమయ్యే వరకు మాస్టర్‌ ప్లాన్‌పై ముందుకెళ్లొద్దని అదికారుల్ని ఆదేశించినట్టు తెలిపారు.  

2041 వరకు ఉండే మాస్టర్‌ప్లాన్‌తో ఎవరికీ నష్టం జరగకూడదన్నారు. పేదల ఇళ్ల పట్ల జీవీఎంసీ దూకుడుపై ఫిర్యాదులు వస్తున్నాయని.. టౌన్‌ ప్లానింగ్‌ విభాగం దూకుడుతో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వంద గజాల్లోపు ఇళ్లపై దూకుడు వద్దని ఆదేశించామన్నారు. ఇళ్లు కూల్చితే సహేతుకమైన కారణం తప్పకుండా ఉండాలని కన్నబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని