
Updated : 08 Jan 2022 12:42 IST
AP News: భవిష్యత్‌లో ఎంత నష్టమో ఉద్యోగులు గమనించాలి: అశోక్‌బాబు
అమరావతి: 23శాతం ఫిట్‌మెంట్‌తో సీఎం జగన్ ఉద్యోగులను వంచించారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవడానికి జూన్ దాకా సమయం కావాలా? అని ప్రశ్నించారు. ప్రస్తుత పీఆర్సీతో పదవీవిరణ చేసే ఉద్యోగులకు నష్టం జరుగుతుందన్నారు. ఈ పీఆర్సీలకు ఉద్యోగులకు రూపాయి కూడా బెనిఫిట్ లేదన్నారు. ‘‘ హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. నష్టాన్ని తగ్గించేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాలి. ఇక నుంచి సెంట్రల్ పీఆర్‌సీ ఇస్తామని సీఎం చెబుతున్నారు. రాష్ట్ర పీఆర్‌సీ వేరు.. సెంట్రల్ పీఆర్‌సీ వేరని ఉద్యోగులు గుర్తించాలి. భవిష్యత్‌లో ఎంత నష్టం జరుగుతుందో ఉద్యోగులు గమనించాలి’’ అని అశోక్ బాబు పేర్కొన్నారు.
Tags :