Andhra news: సముద్రం మధ్యలో వానరం.. అక్కడికి ఎలా వచ్చింది..?

చుట్టూ కనుచూపు మేరలో సముద్రం.. తినడానికి తిండిలేదు, తాగడానికి నీళ్లు లేవు.. రోజురోజుకు ముదురిపోతున్న ఎర్రటి ఎండలతో పాటు సముద్రపు ఉక్కగాలిని తట్టుకుంటూ 3 నెలలుగా ఓ వానరం అక్కడే ఉంటోంది.

Updated : 27 Mar 2022 15:17 IST

కాకినాడ: చుట్టూ కనుచూపు మేరలో సముద్రం.. తినడానికి తిండిలేదు, తాగడానికి నీళ్లు లేవు.. రోజురోజుకు ముదురిపోతున్న ఎర్రటి ఎండలతో పాటు సముద్రపు ఉక్కగాలిని తట్టుకుంటూ 3 నెలలుగా ఓ వానరం అక్కడే ఉంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో? ఎలా వచ్చిందో? ఎవరికీ తెలియదు. కానీ కాకినాడకు మూడు నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రం మధ్యలోకి వచ్చి చిక్కుపోయింది. నిత్యం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అందించే అరకొర ఆహారం కొంత వరకు ఆకలి తీర్చుతున్నా.. తాగడానికి నీరు మాత్రం లేదు. త్వరలోనే చేపల వేట ముగియనుంది. దీంతో మత్స్యకారులు.. జంతు ప్రేమికులకు, కాకినాడ జంతు సంరక్షణ సిబ్బంది, స్థానిక అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ బృందం చాకచక్యంగా వ్యవహరించి మూడు రోజులు శ్రమించి ఆ వానరాన్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని