Monsoon: రెండు నెలల్లో నైరుతి రుతుపవనాల పనితీరు సాధారణమే

రాబోయే రెండు నెలల్లో నైరుతి రుతుపవనాల పనితీరు సాధారణంగానే ఉంటుందని..

Updated : 24 Sep 2022 16:37 IST

అంచనా వేసిన భారత వాతావరణ శాఖ

దిల్లీ: రాబోయే రెండు నెలల్లో నైరుతి రుతుపవనాల పనితీరు సాధారణంగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) అంచనా వేసింది. ఆగస్టు-సెప్టెంబరులో  సగటు వర్షపాతం 95-105 శాతం ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా 428.3 మిమీ వర్షపాతం రానుందని పేర్కొంది. దేశమంతటా ఆగస్టు నెలలో వర్షపాతం 94-106 శాతం మేర సాధారణంగానే ఉంటుందని తెలిపింది. ఈ పరిస్థితుల వల్ల వచ్చే ఖరీఫ్‌ పంటకు ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జులై-ఆగస్టు నెలల్లో అత్యధిక వర్షం పడుతుంది. జులై మధ్యలో దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని