ఏపీలో 17వేలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,494 పరీక్షలు నిర్వహించగా.. 17,354 కేసులు నిర్ధారణ కాగా.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated : 30 Apr 2021 19:18 IST

బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,494 పరీక్షలు నిర్వహించగా.. 17,354 కేసులు నిర్ధారణ కాగా.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,01,690 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,63,90,360 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కొవిడ్‌తో నెల్లూరు, విశాఖలో ఏనిమిది మంది చొప్పున; విజయనగరంలో ఏడుగురు; చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశంలో ఆరుగురు చొప్పున, అనంతపురంలో ఐదుగురు; గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరిలో నలుగురేసి; కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో మగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,992కి చేరింది. 24 గంటల వ్యవధిలో 8,468 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,70,718కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,22,980 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 2,764 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో వెయ్యికిపైగా బాధితులు వైరస్‌ బారినపడ్డారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని