Andhra News: మీడియా ప్రతినిధులపై ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరుల దాడి

కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. 

Updated : 22 May 2023 01:37 IST

కర్నూలు: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ ఘటనలో పలు కెమెరాలు ధ్వంసమయ్యాయి. విలేకరులపై దాడి చేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు మౌనం వహించారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆస్పత్రి వద్దకు వస్తే చంపేస్తామని అవినాష్‌ అనుచరుల బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి (లక్ష్మమ్మ) ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగో అంతస్తులోని ఐసీయూలో ఆమె ఉండగా.. అవినాష్‌రెడ్డి అయిదో అంతస్తులో ఉండి తల్లి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్‌రెడ్డి తాజాగా మరోసారి సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా నేటి(సోమవారం) విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి శ్రీలక్ష్మి డిశ్ఛార్జ్‌ అయిన తర్వాతనే విచారణకు వస్తానని తెలిపారు. కాగా, ఇప్పటికే రెండుసార్లు (ఈనెల 16, 19న) సీబీఐ విచారణకు అవినాష్‌ రెడ్డి గైర్హాజరయ్యారు. అయితే, అవినాష్‌ లేఖపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని