
Updated : 20 Jul 2020 02:16 IST
పాత్రికేయులకు లోకేశ్ బీమా ధీమా
అమరావతి: కరోనా వేళ మంగళగిరి నియోజకవర్గం పాత్రికేయులకు తెదేపా నేత నారా లోకేశ్ బీమా ధీమా కల్పించారు. మంగళగిరి పరిధిలోని 62 మంది పాత్రికేయులకు లోకేశ్ బీమా చేయించారు. సహజ మరణానికి రూ.10 లక్షలు, ప్రమాదమైతే రూ.20లక్షలు, కొవిడ్ మరణాలకూ బీమా వర్తింపజేసేలా ప్రీమియం చెల్లించినట్లు లోకేశ్ తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
Tags :