- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
ఊబకాయులకు మద్యంతో మరింత ముప్పు!
ఇంటర్నెట్ డెస్క్: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా మద్యం సేవించేవాళ్లు ఆ అలవాటును అంత సులువుగా మానుకోలేరు. తక్కువ మోతాదులో తాగే వారికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ, విపరీతంగా మద్యం సేవించేవాళ్లలో కాలేయం దెబ్బతిని.. క్రమంగా ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది. అయితే, మద్యం ప్రియుల్లో ఆరోగ్యంగా.. సన్నగా ఉండే వారికంటే ఊబకాయుల్లో కాలేయం తొందరగా దెబ్బతింటుందని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ మేరకు యూరప్‌కు చెందిన క్లినికల్ న్యూట్రిషియన్ జర్నల్‌లో కథనం ప్రచురించారు.
ఛార్లెస్ పర్కిన్స్ సెంటర్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ ప్రొఫెసర్, రీసెర్చ్ ప్రొగ్రామ్ డైరెక్టర్ ఇమ్మాన్యుయెల్ స్టామటాకిస్ ఈ అధ్యయనంపై వివరణ ఇస్తూ ‘‘ఆరోగ్యంగా, సన్నంగా ఉండే వ్యక్తులతో పోలిస్తే.. అధిక బరువు ఉన్నవాళ్లు, ఊబకాయులకు మద్యం సేవించడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు తొందరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మితంగా మద్యం సేవించినా కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం 50శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది’’అని పేర్కొన్నారు. మద్యపానం విషయంలో యూకే అమలు చేస్తోన్న మార్గదర్శకాలను మించి మద్యం సేవించే ఊబకాయులపై అధ్యయనం చేయగా.. సాధారణ వ్యక్తుల కంటే కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 600శాతం అధికంగా, కాలేయ సంబంధిత వ్యాధులతో మరణాలు 700శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: పార్టీలోనే ఉంటా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మహేశ్వర్‌రెడ్డి
-
Sports News
Chahal-Dhanashree: చాహల్, ధనశ్రీ విడిపోతున్నారా.. ఆ పోస్టుల వెనుక అర్థమేంటీ?
-
India News
Sisodia: కేంద్రం కూడా కాదట.. మరి ఆ నిర్ణయం ఎవరిది?
-
India News
Anand Mahindra: వాసుకిని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా..!
-
General News
Andhra News: యాప్ వివాదం.. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు విఫలం
-
Movies News
OTT Movies: 8వారాల తర్వాతే ఓటీటీలో సినిమా: దిల్‌రాజు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Thiru review: రివ్యూ: తిరు
- Wipro: వేతనాల పెంపు ఆపట్లేదు.. 3 నెలలకోసారి ప్రమోషన్!