Gardening: మొక్కలు పెంచుతున్నారా! అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

ప్రస్తుతం చాలా మంది గృహిణులే కాదు.. యువతులు, పెద్దవాళ్లు కూడా మొక్కలు పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసా?

Published : 08 Oct 2022 18:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం చాలా మంది గృహిణులే కాదు.. యువతులు, పెద్దవాళ్లు కూడా మొక్కలు పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో, టెర్రస్ పైన కూరగాయలు, చిన్న చిన్న పూల మొక్కలను పెంచుతున్నారు. ఇది హర్షించదగ్గ విషయమే. కానీ ఇలా చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో  ఓసారి చూద్దామా? 

ఎక్కువగా నీరు వద్దు!


కొంతమంది చెట్టుకి అవసరం ఉన్నా లేకున్నా నీరు పోస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మొక్క రకాన్ని బట్టి నీటి అవసరం ఉంటుంది. ఏ మొక్కకు ఎంత మోతాదులో నీరు అవసరం ఉంటుందో తెలుసుకుని నీరు అందించడం ఉత్తమం.

* ప్రత్యేకంగా ఎరువులు వాడకూడదని ఇంట్లోనే మొక్కలు పెంచుతున్నారు కాబట్టి.. కంపోస్టు ఎరువు ఎలా తయారు చేస్తారో తెలిసి ఉండాలి. 

* పాదులకు కచ్చితంగా పందిరి వేయండి. ఇది చూడడానికి బాగుంటుంది. పంట కాసినప్పుడు తీసుకునేందుకు వీలుగా ఉంటుంది.

* ప్రస్తుతం మార్కెట్‌లో మొక్కలకు బలాన్నిచ్చే కోకోపీట్‌ లాంటివి విక్రయిస్తున్నారు.  వీటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఆలోచించండి. 

* కుళ్లిన, చనిపోయిన మొక్కలను తొలగించండి. లేదంటే మిగతా మొక్కల పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది.

* మొక్కల గురించి అవగాహన అవసరం 
* మొక్కలు ఏ సమయంలో పూస్తాయో, ఏ కాలంలో పంటనిస్తాయో పూర్తిగా తెలిసుండాలి. కొన్ని రకాల మొక్కలు ఏ కాలంలో అయినా ఎదుగుతాయి. ఇంకొన్ని ఒక నిర్ణీత కాలంలో మాత్రమే పెరుగుతాయి. 

* అన్ని మొక్కలకు ఒకేరకమైన నేల అనువుగా ఉండదు. ఆయా రకాల మొక్కలు ఆయా నేలల్లోనే ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలను బట్టి మట్టిని ఎంచుకోవడం ఉత్తమం. ఒకవేళ మీరు పెంచాలనుకున్న మొక్కలకు నేల అనువుగా లేకుంటే.. కుండీల్లో ఆ మట్టిని నింపి అందులో మీరు నాటాలనుకున్న మొక్కలను పెంచండి.  

* మొక్కలను పెంచేందుకు ఇరుకుగా ఉన్న కుండీలు కాకుండా వెడల్పుగా ఉన్న వాటిని వాడండి.  దీనివల్ల మొక్కల వేర్లు విస్తరించేందుకు అనువుగా ఉంటుంది.

 

* కొన్ని మొక్కలు ఎక్కువ సూర్యరశ్మిలో పెరగలేవు. మొత్తం నీడలో కూడా పెరగవు. ఇలాంటి మొక్కలు పెరిగేందుకు అనువుగా పరదా లాంటివి అమర్చాలి. దీంతో వాటికి కావాల్సినంత సూర్యరశ్మిని తీసుకుని చక్కగా ఎదుగుతాయి. 

* పని చేసే సమయంలో కచ్చితంగా చేతికి గ్లౌజులు ధరించండి. 

* మొక్కలకు ఏదైనా వ్యాధులు సోకితే సంబంధిత వ్యవసాయ క్షేత్ర అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవడం మంచిది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని