Raj kundra: రాజ్‌ కుంద్రా బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఎప్పుడంటే?  

అశ్లీల వీడియోల నిర్మాణం, ప్రసారం కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, అతని సహచరుడు రయాన్‌ థోర్ప్‌ బెయిల్‌ పిటిషన్లపై ఆగస్టు 10న వాదనలు వింటామని ముంబయి సెషన్స్‌ కోర్టు గురువారం తెలిపింది.

Updated : 06 Aug 2021 04:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అశ్లీల వీడియోల నిర్మాణం, ప్రసారం కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, అతని సహచరుడు రయాన్‌ థోర్ప్‌ బెయిల్‌ పిటిషన్లపై ఆగస్టు 10న వాదనలు వింటామని ముంబయి సెషన్స్‌ కోర్టు గురువారం తెలిపింది. బెయిల్‌ విషయంలో మీ స్పందన తెలపాలంటూ ముంబయి పోలీసులను ఆదేశించింది. ‘నిందితుల విడుదల దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తుంది.. పైగా వారు చేసింది సమాజానికి హానికరమైన పని’గా పేర్కొంటూ.. మెజిస్ట్రేట్ కోర్టు వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ వారు సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అశ్లీల చిత్రాల వ్యవహారం కేసులో తమను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ వారిద్దరు దాఖలు చేసిన పిటిషన్లపై బాంబే హైకోర్టు ఆగస్టు 2న తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని