Droupadi Murmu: పోచంపల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అన్నారు.

Updated : 20 Dec 2023 14:56 IST

పోచంపల్లి: చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అన్నారు. పోచంపల్లి (Pochampalli) పర్యటనలో భాగంగా ఆమె చేనేత మగ్గాలను, టై అండ్‌ డై ఇక్కత్‌ పట్టు చీరల తయారీని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు.

‘‘చేనేత కళ విభిన్నమైంది. ఫ్యాషన్‌ డిజైన్‌ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయం. చేనేత కళను భావితరాలకు అందించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం హర్షణీయం. పోచంపల్లి చేనేత కార్మికులు ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుంటాను. పోచంపల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని