ఏడు రాష్ట్రాలు.. ఆరు దేశాల్లో పీవీ విగ్రహాలు: కేకే

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వస్థలం వంగర అక్కనపల్లిలో ఆగస్టులో పీవీ విగ్రహం ఆవిష్కరించనున్నట్లు తెరాస నేత కె.కేశవరావు తెలిపారు. రవీంద్ర భారతిలో పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. కమిటీ ఛైర్మన్‌ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తదుపరి

Published : 31 Jul 2020 21:52 IST

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వస్థలం వంగర అక్కనపల్లిలో ఆగస్టులో పీవీ విగ్రహం ఆవిష్కరించనున్నట్లు తెరాస నేత కె.కేశవరావు తెలిపారు. శుక్రవారం రవీంద్ర భారతిలో పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సమావేశం జరిగింది. కమిటీ ఛైర్మన్‌ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై చర్చించారు. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను కె. కేశవరావు ప్రారంభించారు. ఉత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో పొందుపర్చనున్నారు. పీవీ ఘాట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు మూడు ప్రణాళికలు అమలు చేయనున్నట్లు కేకే తెలిపారు. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో పీవీపై ఓ సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, శశికౌర్‌ను ఆహ్వానిస్తామని కేశవరావు వెల్లడించారు.

‘‘విజయవాడ, విశాఖలోనూ పీవీ సభలు ఏర్పాటు చేసి ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానిస్తాం. పీవీ వర్థంతి రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్‌‌ కోవింద్‌ను ఆహ్వానిస్తాం. ఏడు రాష్ట్రాల్లో, ఆరు దేశాల్లో పీవీ నరసింహా రావు విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. తెలుగు రాష్ట్రాలు సహా పంజాబ్‌, బంగాల్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో.. అలాగే యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సహా ఆరు దేశాల్లో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. ఆయా దేశాల్లో సదస్సులు ఏర్పాటు చేసి బిల్‌ క్లింటన్‌, ఒబామాను ఆహ్వానిస్తాం’’అని కేశవరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని