లవణంతో లక్షణమైన చిత్రాలు
బషీర్ సుల్తానీ గత తొమ్మిదేళ్లుగా కేవలం ఉప్పుతో రకరకాల ఆకృతులను రూపొందిస్తూ అందరినీ విస్మయపరుస్తున్నారు. మొదట్లో కేవలం తెల్లటి ఉప్పుతో మహాత్మ గాంధీ, అల్బర్ట్ ఐన్‌స్టీన్, చార్లిన్ చాప్లిన్ వంటి ప్రముఖులతోపాటు.. పలు సినిమాల్లోని పాత్రలు, సినిమా టైటిల్స్‌ను ఉన్నదిఉన్నట్టుగా
ఇంటర్నెట్ డెస్క్: అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. దేన్నైనా కళాత్మక హృదయంతో చూస్తే అద్భుతాలు చేయొచ్చు అనేది ఆ వ్యాఖ్య ఉద్దేశం. కెనడాకు చెందిన బషీర్ సుల్తానీ ఆ వ్యాఖ్య నిజమేనని నిరూపిస్తున్నారు. వంటల్లో వాడే ఉప్పు బషీర్‌కు కళాత్మక వస్తువుగా కనిపించింది. అంతే ఆ ఉప్పుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
బషీర్ సుల్తానీ గత తొమ్మిదేళ్లుగా రకరకాల ఆకృతులను కేవలం ఉప్పుతో చిత్రాలుగా రూపొందిస్తూ అందరినీ విస్మయపరుస్తున్నారు. మొదట్లో కేవలం తెల్లటి ఉప్పుతో మహాత్మ గాంధీ, అల్బర్ట్ ఐన్‌స్టీన్, చార్లీ చాప్లిన్ వంటి ప్రముఖులతోపాటు.. పలు సినిమాల్లోని పాత్రలు, సినిమా టైటిల్స్‌ను ఉన్నది ఉన్నట్టుగా చిత్రాలుగా రూపొందించారు. ఆ తర్వాత ఉప్పులో రంగులు కలిపి జీవం ఉట్టి పడే విధంగా చిత్రాలు రూపొందించడం మొదలుపెట్టారు. విశ్వం, భూమి, చంద్రుడు, పిజ్జా, బర్గర్, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ ఇలా ఎన్నింటినో తెలుపు/నలుపు ప్లేటుపై రంగుల ఉప్పుతో ఆవిష్కరించారు. వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తుండటంతో బషీర్ ప్రతిభపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. ఆ కళాత్మక చిత్రాలను ఎలా రూపొందిచారో మీరూ చూసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Game Changer: అందుకే షూటింగ్ వాయిదా.. రూమర్స్‌పై ‘గేమ్ ఛేంజర్’ టీమ్
-
TOEFL: విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌పై.. భారతీయుల మొగ్గు!
-
India vs Australia: ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు.. కంగారూల ఎదుట భారీ లక్ష్యం
-
Kangana Ranaut: మహేశ్ బాబు సినిమాలో నటించలేదన్న బాధ ఉంది: కంగనా రనౌత్
-
Chandrababu Arrest: అక్టోబరు 5వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
-
Ukraine : యుద్ధం ముగిసిన వెంటనే అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు పెట్టుబడులు : జెలెన్ స్కీ