
Published : 22 Feb 2021 17:30 IST
ముప్పు తప్పలేదు.. జాగ్రత్తలు పాటించండి
భువనేశ్వర్: దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలనే సందేశంతో ఒడిశా కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ సైకతశిల్పం రూపొందించారు. మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలనే సూచనలతో సైకతశిల్పాన్ని తీర్చిదిద్దారు. పూరీ తీరంలో పట్నాయక్ రూపొందించిన సందేశాత్మక సైకతశిల్పం కొవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, అప్రమత్తత అవసరమని చాటుతోంది.
ఇవీ చదవండి
Tags :