Lifestyle: ఆనందమయ జీవితానికి ఆరు సూత్రాలు!
జీవితం ఆనందంగా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ, ఆ దిశగా ప్రయత్నం చేసేవారు మాత్రం కొందరే. శారీరక, మానసిక సంతోషాలను మిళితమే ఆనందం. ఆ రెండిట్లో ఏది లేకపోయినా ఆనందంగా లేనట్లే....
జీవితం ఆనందంగా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ, ఆ దిశగా ప్రయత్నం చేసేవారు మాత్రం కొందరే. శారీరక, మానసిక సంతోషాల మిళితమే ఆనందం. ఆ రెండిట్లో ఏది లేకపోయినా ఆనందంగా లేనట్లే. అయితే, దీనికి కొంత కృషి కూడా అవసరం. అప్పుడే ఆనందమయ జీవితం మన సొంతమవుతుంది. వ్యాయామం, ఆటల వల్ల శారీరకంగా కొంత పరిపుష్టత సాధించవచ్చు. కానీ, మానసికంగా దృఢంగా ఉండాలంటే.. కొన్ని లక్షణాలను అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు.
1.నవ్వుతూ ఉండండి
నవ్వు.. ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగించే ఓ ఆయుధం. వ్యతిరేక ఆలోచనలను దరి చేరనివ్వదు. అంతేకాకుండా ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. నవ్వుతూ నవ్విస్తూ ఉండటం వల్ల మీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఒత్తిడి దూరమవుతుంది. ఏ పనినైనా ఇష్టంగా చేయడం అలవాటు చేసుకోండి. క్రమంగా అది అలవాటుగా మారిపోతుంది. ఆ తర్వాత మీరు వద్దనుకున్నా వదులుకోలేరు.
2. కృతజ్ఞతతో డబుల్
ఎవరైనా సాయం చేస్తే వెంటనే వారికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. అవతలి వాళ్లు చేసిన పనిని మెచ్చుకోండి. దీనివల్ల ఎదుటి వారిలో మనపై సానుకూలత ఏర్పడుతుంది. అంతేకాకుండా మన కోసం ఏదైనా చేసేవారు ఉన్నారన్న ఆత్మవిశ్వాసం మనలోనూ కలుగుతుంది. ఇద్దరి మధ్య సంబంధం మరింత బలోపేతమవుతుంది. కృతజ్ఞత చూపిస్తే.. అంతే మొత్తంలో తిరిగి వస్తుందన్న విషయం మర్చిపోవద్దు.
3. ఆశావాదం ఏదైనా చేస్తుంది
ఆశావాదం ఎంతటి పనినైనా సులువుగా చేయిస్తుంది. అదే నిరాశతో కుంగిపోతే ఒక్క అడుగు కూడా ముందుకేయలేం. ఎవరైతే స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ దిశగా అడుగులు వేశారో వాళ్లంతా చాలా సంతోషంగా ఉన్నట్లు అధ్యయనాలు చెప్పకనే చెబుతున్నాయి. అందువల్ల శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోకుండా భవిష్యత్‌లో ఏం సాధించాలన్న దానిపై కచ్చితమైన ప్రణాళిక వేసుకోవాలి. సదుద్దేశంతో కూడిన ఆశావాదం అయస్కాంతం లాంటింది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చిన్నపాటి అవాంతరాలు ఎదురైనా ఆ ఆకర్షణ శక్తిలో కలిసిపోయి సులువుగా చేరుకోగలుగుతాం.
4. దాతృత్వం చూపండి
ఇతరులకు ఏదైనా పెట్టే విషయంలో అతిగా ఆలోచించవద్దు. ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు అవతలి వారి ముఖాల్లో ఓ రకమైన సంతోషం కలుగుతుంది. అందులోనే మనం ఆనందాన్ని వెతుక్కోవాలి. పుచ్చుకున్న వారికంటే ఇచ్చిన వారికే ఎక్కువ సంతోషం కలుగుతుందని అధ్యయనాల్లో తేలింది. మానసికంగా కుంగిపోయినప్పుడుగానీ, ఒత్తిడిలో ఉన్నప్పుడుగానీ ఇతరులకు కాస్తా సాయం చేసి చూడండి. ఎంతలా ఉపశమనం లభిస్తుందో మీకే తెలుస్తుందంటారు నిపుణులు.
5. అర్థం చేసుకునే గుణం
ఇతరులను అర్థం చేసుకునే లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ఏదైనా సమస్యను అవతలి వాళ్లు మనతో చెబుతున్నారంటే.. దానికి ఓ పరిష్కారం చూపిస్తామనే నమ్మకంతోనే. వాళ్ల సమస్యను విని ఓ మార్గం చూపిస్తే.. మీపై నమ్మకం పెరుగుతుంది. ఈ లక్షణమే ఇతరుల నుంచి మనకు గుర్తింపు తెస్తుంది. అర్థం చేసుకునే గుణం అలవడితే సంబంధాలు బలపడతాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. కోపం కూడా దాదాపు ఉండదు. ఫలితంగా ఆనందం మన సొంతమవుతుంది.
6. శక్తి పునరుద్ధరించుకోండి
శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నప్పుడే సంతోషం, ఆనందం సొంతమవుతాయి. ఆహారమే మన శరీరానికి ఇంధనం. అందువల్ల ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలి. కచ్చితమైన ఆహార నిబంధనలు పాటించాలి. నిద్రలేమి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. ఆ తర్వాత రోజుకి సిద్ధం అవ్వగలుగుతాం. లేదంటే నిస్సత్తువ ఆవహించినట్లవుతుంది.
ఈ లక్షణాలన్నింటినీ అలవాటు చేసుకుంటే ఇక అంతా ఆనందమే కదా..!
-ఇంటర్నెట్‌డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
India News
ChatGPT: భారత్ వెర్షన్ చాట్‌జీపీటీ ఎప్పుడంటే..? మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిదే..!
-
Sports News
Labuschagne:ఐపీఎల్లో నా ఫేవరెట్ టీమ్ అదే.. అశ్విన్ బెస్ట్ స్పిన్నర్: లబుషేన్
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!