Health: మండే ఎండల్లో జర భద్రం... ఈ చిట్కాలు పాటిస్తే సరి!

ఎండాకాలం వచ్చిందంటే చర్మ సమస్యలు మొదలవుతాయి. చెమట, చెమటకాయలు, గజ్జి, తామర లాంటి ఇబ్బందులు అనేకం వెంటాడుతాయి

Updated : 10 Apr 2022 16:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎండాకాలం వచ్చిందంటే చర్మ సమస్యలు మొదలవుతాయి. చెమట, చెమటకాయలు, గజ్జి, తామర లాంటి ఇబ్బందులు అనేకం వెంటాడుతాయి. నీరు తక్కువగా తాగితే వడదెబ్బ ప్రాణాలను హరిస్తుంది. దాహం వేస్తుందని ఏదీ ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగడంతో కలుషితమై అతిసారం పొంచి ఉంటుంది. మిగితా కాలాలతో పోల్చుకుంటే వేసవిలో ప్రతి ఒక్కరూ అతి జాగ్రత్తగా ఉండాలి. శరీరాన్ని గుల్ల చేసే ఎండలను కాచుకోవాలి. అతి ఎండలతో ప్రమాదకర పరిస్థితులే కాదు..చర్మ వ్యాధులు వెంటాడుతాయని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చూద్దాం.

  • ఎండల కాలంలో సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. సూర్యతాపానికి నేరుగా ప్రభావితం అయ్యేది చర్మమే. 
  • అధిక ఉష్ణోగ్రత, రేడియేషన్‌తో చర్మాన్ని పలు సమస్యల్లోకి నెట్టేస్తుంది. 
  • ఎండలోకి వెళ్లినపుడు సూర్యుని అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మ కణజాలంలోకి దూసుకొని పోయి ఇబ్బంది పెడుతాయి.
  • ఎండలోకి వెళ్లినపుడు చర్మం నల్లబారి పోతుంది. చెమటలో ఒళ్లంతా చెమట కాయలు వస్తాయి. దురద, మంట లేస్తుంది.
  • చర్మంపై వేడి, తడి కలిసిఉన్న చోట ఫంగస్‌ వృద్ధి చెందుతుంది.  దీనితొ గజ్జి, తామన లాంటి ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
  • ఎండ వేడిమితో చర్మంలోని ఎలాస్టిక్‌ కణజాలం దెబ్బతింటుంది.

  • సెగ్గడ్డల బెడద అధికంగా ఉంటుంది. 
  • ఎండాకాలంలో ఆభరణాలతో కూడా చర్మ సమస్యలు వస్తాయి. బంగారు కంటే రాగి,కోబాల్ట్‌ లోహాలతో తయారయిన ఆభరణాలతో అలెర్జీలు అధికంగా రానున్నాయి.
  • ఎండల తీవ్రతతో వచ్చే సమస్యలను నివారించాలంటే తరచుగా నీటిని తాగాలి. ద్రవ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. 
  • శరీరాన్ని చల్లపరిచే శర్బత్‌, నిమ్మరసం, మజ్జిగ ద్రవాహారాన్ని అధికంగా తాగాలి.
  • ఎండ ప్రభావం చర్మంపై తగలకుండా సన్‌స్క్రీన్‌ లోషన్లను వాడుకోవాలి.
  • కాటన్‌ దుస్తులు, నలుపు రంగు కాని గొడుగులను వినియోగించుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని