Viveka Murder Case: శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వలేం: పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి బెయిల్‌

Published : 26 Sep 2022 13:32 IST

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హత్య కేసులో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ శివశంకర్‌ రెడ్డి ఇటీవల సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇవాళ జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణమురారితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. అనంతరం అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని