మన్నేపల్లి అప్పారావుకు ‘స్వామి వివేకానంద ఇండియన్‌ ఐకాన్‌’ అవార్డు

స్వామి వివేకానంద జయంతి నేపథ్యంలో స్వామి వివేకానంద ఇండియన్‌ ఐకాన్‌ పురస్కారం ఈ ఏడాది ప్రముఖ సామాజిక కార్యకర్త మన్నేపల్లి అప్పారావు అందుకున్నారు.

Published : 29 Jan 2023 21:43 IST

హైదరాబాద్‌: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విశ్వగురు రికార్డ్స్‌ కమిటీ ఇచ్చే ‘స్వామి వివేకానంద ఇండియన్‌ ఐకాన్‌’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కూకట్‌పల్లిలోని భారత్‌ వికాస్‌ పరిషత్‌లో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2023 ఏడాదికి గాను స్వామి వివేకానంద ఇండియన్‌ ఐకాన్‌ అవార్డును ప్రముఖ సామాజిక కార్యకర్త మన్నేపల్లి అప్పారావుకు ప్రదానం చేశారు.

‘థాంక్స్‌ గివింగ్‌’ అనే నరేంద్రుని మహోక్తిని అక్షరాలా పాటిస్తూ సాటి మనుషులకు సాయం అందిస్తోన్న మన్నేపల్లి అప్పారావు.. కర్ణాటకలోని కలికేరి విశ్వవిద్యాలయం, నరసరావుపేట వద్ద నైస్‌ విశ్వవిద్యాలయం, విశాఖ జిల్లాలోని చలిసింగం గ్రామంలో విద్యాలయం.. ఇలా పాఠశాలల నిర్మాణంలో తన వంతు సహకారం అందించారు. నిరు పేదల కష్టాలకు చలించే గొప్ప మనసున్న ఆయన.. అటవీ ప్రాంతాల్లోని పలుచోట్ల ప్రాథమిక పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని తన ఇంట్లో పేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించి వారిని ఇంజినీర్లు, సైంటిస్టులు, ఫార్మసీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఉన్నతులుగా ఎదిగేందుకు సహకరించి తన గొప్ప మనసును చాటుకున్నారు. గిరిపుత్రులకు వీఆర్‌ పురం మండలంలోని పోలవరం నిర్వాసితులకు మూడు పంటలు పండే దాదాపు 400 ఎకరాల భూముల్ని ఇప్పించి వారికి ఆరాథ్యుడయ్యారు. స్వామి వివేకానంద ఇండియన్‌ ఐకాన్‌ పురస్కారం అందుకోవడం తనకు ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని