Telangana News: పేదలకు స్థలాలు.. క్రమబద్ధీకరణపై ఉపసంఘం భేటీ.. అధికారులకు పలు ఆదేశాలు

గ్రామకంఠాలు సహా వివిధ ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తోన్న పేదలకు వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. పేదల ఇళ్ల స్థలాలు, వాటి క్రమబద్ధీకరణ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం బీఆర్కే భవన్‌లో సమావేశమైంది.

Published : 13 Feb 2023 22:17 IST

హైదరాబాద్‌: గ్రామకంఠాలు సహా వివిధ ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తోన్న పేదలకు వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. పేదల ఇళ్ల స్థలాలు, వాటి క్రమబద్ధీకరణ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం బీఆర్కే భవన్‌లో సమావేశమైంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామ కంఠంలోని స్థలాలకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన కసరత్తు.. 58, 59 ఉత్తర్వులకు లోబడి క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం, ప్రస్తుత స్థితి, సంబంధిత అంశాలను మంత్రులు సమీక్షించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రస్తుత స్థితికి సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారాన్ని శనివారం లోపు సిద్ధం చేయాలని అధికారులను కమిటీ ఆదేశించింది. సోమవారం మరోమారు సమావేశమై స్థలాల సంబంధిత అంశాలు, సమస్యల పరిష్కారంపై కమిటీ చర్చించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని