Ap News: ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును ఇకపై తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్..

Updated : 24 Aug 2021 20:12 IST

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును ఇకపై తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కారణంగా 2020 మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరు నుంచి ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ నెల 13న జరిగిన కార్యదర్శుల సమావేశంలో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఐటీ శాఖను సీఎస్ ఆదేశించారు. సచివాలయం సహా హెచ్ఓడీ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్యయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బయోమెట్రిక్ హాజరు నమోదుకు నెలవారిగా నివేదికలను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ప్రతీ శాఖ కార్యదర్శి.. ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని