TS News: కోర్టుల సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

హనుమకొండలో పది కోర్టుల భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు.

Updated : 19 Dec 2021 13:05 IST

హనుమకొండ: హనుమకొండలో పది కోర్టుల భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో కలిసి సీజేఐ కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు.

సీనియర్‌ సివిల్‌ న్యాయస్థానాన్ని పోక్సో కోర్టుగా మార్పు చేశారు. లైంగిక దాడుల కేసుల్లో విచారణకు వచ్చేవారు కనపడకుండా ఏర్పాట్లు చేశారు. చిన్నారులు, తల్లిదండ్రులు, కక్షిదారులు కనపడకుండా ప్రత్యేక ద్వారాన్ని సిద్ధం చేశారు. విచారణ కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రవేశమార్గం వద్ద ఆకట్టుకునే రీతిలో కాకతీయ కళాతోరణాన్ని తీర్చిదిద్దారు. కోర్టు లోపలికి వెళ్లే మార్గంలో పూలమొక్కలు ఏర్పాటు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని