CM Jagan: పెద్ద చదువులు చదివితేనే పేదల తలరాతలు మారతాయి: సీఎం జగన్‌

విద్యార్థులు ఏ విషయంలోనూ ఇబ్బందులు పడకూడదని.. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.

Updated : 30 Nov 2021 12:53 IST

అమరావతి: విద్యార్థులు ఏ విషయంలోనూ ఇబ్బందులు పడకూడదని.. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ‘జగనన్న విద్యాదీవెన’ కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను సీఎం విడుదల చేశారు.

ఈ ఏడాది మూడో విడతగా రాష్ట్రంలోని దాదాపు 11.03లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్ల నిధులను తల్లుల ఖాతాల్లో సీఎం జమ చేశారు. పేద విద్యార్థుల కోసమే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని.. వారికి అన్నిరకాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు. పెద్ద చదువులు చదివితేనే పేదల తలరాతలు మారతాయన్నారు. విద్యార్థులను వందశాతం గ్యాడ్యుయేట్లగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని